Saturday, August 30, 2008

Thursday, August 7, 2008

మహాలక్ష్మ్యష్టకం

మహాలక్ష్మ్యష్టకం

మహాలక్ష్మీ అష్టకము
నమస్తేస్తు మహామాయే - శ్రీ పీఠే సురపూజితే
శంఖచక్రగదాహస్తే - మహాలక్ష్మీ ర్నమోస్తుతే 1

నమస్తే గరుడారూఢే - డోలాసురభయంకరి
సర్వపాపహరే దేవి - మహాలక్ష్మీ ర్నమోస్తుతే 2

సర్వజ్ఞే సర్వవరదే - సర్వదుష్టభయంకరి
సర్వదుఖఃహరే దేవి - మహాలక్ష్మీ ర్నమో స్తుతే 3

సిద్ధిబుద్ధిప్రదే దేవి - భుక్తిముక్తిప్రదాయిని
మంత్రమూర్తే సదా దేవి - మహాలక్ష్మీ ర్నమో స్తుతే 4

ఆద్యంతరహితే దేవి - ఆదిశక్తే మహేశ్వరి
యోగజ్ఞే యోగసంభూతే - మహాలక్ష్మీ ర్నమో స్తుతే 5

స్థూలసూక్ష్మే మహారౌద్రే - మహాశక్తే మహోదరే
మహాపాపహరే దేవి - మహాలక్ష్మీ ర్నమో స్తుతే 6

పద్మాసనస్థితే దేవి - పరబ్రహ్మస్వరూపిణి
పరమేశి జగన్మాతర్‌ - మహాలక్ష్మీ ర్నమో స్తుతే 7

శ్వేతాంబరధరే దేవి - నానాలంకారభూషితే
జగత్థ్సితే జగన్మాతర్‌ - మహాలక్ష్మీ ర్నమో స్తుతే 8

మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం - యః పఠే ద్భక్తిమా న్నరః
సర్వసిద్ధి మావాప్నోతి - రాజ్యం ప్రాప్నోతి సర్వదా 9

తేకకాలే పఠే న్నిత్యం - మహాపపావినాశనమ్‌
ద్వికాలం యః పఠే న్నిత్యం - ధనధాన్యసమన్వితః 10

త్రికాలం యః పఠే న్నిత్యం - మహాశత్రువినాశనం
మహాలక్ష్మీ ర్భవే న్నిత్యం - ప్రసన్నా వరదా శుభా 11
ఇతి ఇంద్రకృత మహాలక్ష్మ్యష్టకం

హనుమాన్ చాలీసా

హనుమాన్ చాలీసా

శ్రీ గురు చరణ సరోజరజ,
నిజమనముకుర సుథార్!
బరణౌ రఘువర విమల యశ,
జో దాయక ఫలచార !!
బుద్ధిహిన తను జానికీ,
సుమిరౌ పవన కుమార్ !
బలబుద్ధి విద్యా దేహు మోహిం,
హరహు కలేశ విహార !!


జయ హనుమాన జ్ఞాన గుణ సాగర !
జయ కపీశ తిహులోక ఉజాగర !!

రామదూత అతులిత బలధామా !
అంజనిపుత్ర పవనసుత నామా !! ౨ !!

మహావీర విక్రమ బజరంగీ !
కుమతి నివార సుమతి కే సంగీ !! ౩ !!

కంచన వరణ విరాజసువేశ !
కానన కుండల కుంచిత కేశ !! ౪ !!

హాథ వజ్ర ఔ ధ్వజా విరాజై !
కాంధే మూంజ జనేవూ సాజై !! ౫ !!

శంకర సువన కేశరీ నందన !
తేజ ప్రతాప మహాజగవందన !! ౬ !!

విద్యావాన గుణీ అతి చాతుర !
రామకాజ కరివేకో ఆతుర !! ౭ !!

ప్రభుచరిత్ర సునివేకో రసియా !
రామలఖణ సితామన బసియా !! ౮ !!

సూక్ష్మరూప ధరి సియహి దిఖావా !
వికట రూప ధరి లంక జరావా !! ౯ !!

భీమరూప ధరి అసుర సంహారే !
రామచంద్రకే కాజ సంవారే !! ౧౦ !!

లాయ సజీవన లఖన జియాయే !
శ్రీ రఘువీర హరషి ఉరలాయే !! ౧౧ !!

రఘుపతి కీన్హీ బహుత బడాయీ !
తుమ మామ ప్రియ భారత హి సమ భాయీ !! ౧౨ !!

సహస వదన తుమ్హరో యశగావై !
ఆస కహి శ్రీపతి కంఠ లగావై !! ౧౩ !!

సనకాదిక బ్రహ్మ మునీశా !
నారద శారద సహిత అహీశా !! ౧౪ !!

యమ కుబేర దిగపాల జహాతే !
కవి కోవిద కహి సకై కహాతే !! ౧౫ !!

తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా !
రామ మిలాయ రాజపద దీన్హా !! ౧౬ !!

తుమ్హారో మంత్ర విభీషణ మానా !
లంకేశ్వర భయే సబజగ జానా !! ౧౭ !!

యుగ సహస్ర యోజన పర భానూ !
లీల్యో తాహి మధుర ఫల జానూ !! ౧౮ !!

ప్రభ ముద్రికా మేలి ముఖ మాహీ !
జలధి లాంఘి గయే ఆచరజ నాహీ !! ౧౯ !!

దుర్గమ కాజ జగతకే జేతే !
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే !! ౨౦ !!

రామ దుఆరే తుమరఖవారే !
హో తన ఆజ్ఞా బినుపైసారే !! ౨౧ !!

సబ సుఖలహై తుమ్హారి సరనా !
తుమ రక్షక కాహూకో డరనా !! ౨౨ !!

ఆపన తేజ సమ్హారో ఆపై !
తీనో లోక హాంకతే కాంపై !! ౨౩ !!

భూత పిశాచ నికట నహి ఆవై !
మహవీర జబ నామ సునావై !! ౨౪ !!

నాశై రోగ హరి సబ పీరా !
జపత నిరంతర హనుమత వీరా !! ౨౫ !!

సంకట సే హనుమాన చుడావై !
మన క్రమ వచన ధ్యానజోలావై !! ౨౬ !!

సబ పర రామ తపస్వి రాజా !
తినకే కాజ సకల తుమ సాజా !! ౨౭ !!

ఔరా మనోరథ జోకో ఇలావై !
నోయి అమిత జీవన ఫల పావై !! ౨౮ !!

చారో యుగ పరతాప తుమ్హారా !
హై పరసిద్ధి జగత ఉజియారా !! ౨౯ !!

సాధు సంతకే తుమరఖవారే !
అసుర నికందన రామ దులారే !! ౩౦ !!

అష్టసిద్ధి నవ నిధికే దాతా !
అసవర దీన జానకీ మాటా !! ౩౧ !!

రామ రసాయన తుమ్హరే పాసా !
సదా రహో రఘుపతికే దాసా !! ౩౨ !!

తుమ్హరే భజన రామకో పావై !
జన్మ జన్మ కే దుఃఖ బిసరావై !! ౩౩ !!

అంతకాల రఘువర పురజాయీ !
జహా జన్మ హరి భక్త కహాయీ !! ౩౪ !!

ఔర దేవతా చిత్తన ధరయీ !
హనుమత సేయి సర్వ సుఖ కరయీ !! ౩౫ !!

సంకట హటై మిటై సబ వీరా !
జో సుమిరై హనుమత బాల వీరా !! ౩౬ !!

జై జై జై హనుమాన గో సాయీ !
కృపాకరో గురుదెవకీ నాయీ !! ౩౭ !!

జోహ శత బార పాఠ కర జోయీ !
చూటహి బంది మహాసుఖ హొయీ !! ౩౮ !!

జో యహ పఢై హనుమాన చాలీసా !
హోయ సిద్ధి సాఖీ గౌరీశా !! ౩౯ !!

తులసీ దాస సదా హరి చేరా !
కీ జై నాథ హృదయ మహా డేరా !! ౪౦ !!

దోహాపవన తనయ సంకట హరణ మంగళ మూరతి రూప !
రామలఖన సీతా సహిత హృదయ బసహు సురభూప

ఆంజనేయ దండకం

ఆంజనేయ దండకం
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భాజేవాయుపుత్రం భాజేవాలగాత్రం భజేహం పవిత్రం భాజేసూర్యమిత్రం భాజేబ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రము నీ నామసంకీర్తనల్జేసి నీ రూపు వర్ణించి నీమీద నే దండకంబోక్కటింజేయ నూహించి నీ ముర్తినిఁ గాంచి నీ సుందరంబెంచి నీ దాస దాసుండనై రామ భక్తుండనై నిన్ను నే కొల్చితే నీకటాక్షంబునన్ జూచితే వేడుకల్జేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్మయాదేవి నిన్నెంచ నేనెంత వాడన్ దయాశాలివై జూచితే దాతవై బ్రోచితే దగ్గరన్నిల్చితే తొల్లి సుగ్రీవుకున్మన్త్రివై స్వామి కార్యార్థమందుండి శ్రీ రామ సౌమిత్రులంజూచి వారిన్విచారించి సర్వేషు పూజించి యద్భానుజుంబంటు గావించి యవ్వాలినింజంపి కాకుత్స్థ తిలకున్ దయాదృష్టి వీక్షించి కిష్కింధకేతెంచి శ్రీ రామ కార్యార్థమై లంక కేతెంచియుం లంకినిన్ జంపియుం లంకయుం గాల్చియున్ భూమిజం జూచి ఆనందముప్పొంగ నాయుంగారంబిచ్చి యారత్నమున్ దెచ్చి శ్రీ రాముకున్నిచ్చి సంతోషునింజేసి సుగ్రీవుడా యంగదా జాంబవంతాది వీరాదులంగూడి యాసేతువున్ దాటి వానరామూక పెన్మూకలై దైత్యులంద్రుంచగా రావణుండంత కాలాగ్ని రూపోగ్రుడై కోరి బ్రహ్మాండమైనట్టి యా శక్తియున్ వేసి యా లక్ష్మణున్ మూర్ఛనొందించగా నప్పుడే పోయి సంజీవియుం దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షించగా కుంభకర్ణాదులన్వీరులన్ బోరి శ్రీ రాము బాణాగ్ని వారందరిం రావణుం జంపగా నంత లోకంబులానందమైయుండి నవ్వేళలందవ్విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీ రాముతో జేర్చి నయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమై యున్న నీకన్న నాకెవ్వరుంగూర్మి లేరంచు మన్నించినన్ శ్రీరామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామసంకీర్తనల్జేసితే పాపముల్బాయవే భయములున్దీరవే భాగ్యముల్గల్గవే సకల సామ్రాజ్యముల్సకల సంపత్కరంముల్దగంగల్గావే వానరాకార యోభక్తమందార యోపుణ్యసంచార యోధీర యోవీర నీవే సమస్తంబు నీవే మహాఫలముగా వెలసి యా తారక బ్రహ్మమంత్రంబు సంధానమున్ జేయుచున్ స్థిరముగా వజ్రదేహంబునుం దాల్చి శ్రీరాము శ్రీరాము యంచుంమనః పూతమై ఎప్పుడున్ తప్పకం దలతు నా జిహ్వాయందుండియుం దీర్ఘ దేహంబు త్రైలోక్య సంచారివై రామనామాంకితధ్యానివై బ్రహ్మవై బ్రహ్మ తేజంబునం రౌద్ర నిజ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార ఓంకార శబ్దంబులన్ క్రూర సర్వ గ్రహ భూత ప్రేత పిశాచ శాకినీ ఢాకినీ మోహినీ గాలిదయ్యంబులన్నీదువాలంబునంజుట్టి నేలంబడంగొట్టి నీ ముష్టి ఘాతంబులం బాహుదండంబులం రోమఖండంబులం ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మప్రభాభాసితంబయిన నీదివ్య తేజంబునుం జూపి రారా నా ముద్దు కుమారా యంచు దయాదృష్టి వీక్షించి నన్నేలు నాస్వామి నమస్తే నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే వ్రతపూర్ణహరీ నమస్తే వాయుపుత్ర నమస్తే నమోనమః