Thursday, August 7, 2008

ఆంజనేయ దండకం

ఆంజనేయ దండకం
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భాజేవాయుపుత్రం భాజేవాలగాత్రం భజేహం పవిత్రం భాజేసూర్యమిత్రం భాజేబ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రము నీ నామసంకీర్తనల్జేసి నీ రూపు వర్ణించి నీమీద నే దండకంబోక్కటింజేయ నూహించి నీ ముర్తినిఁ గాంచి నీ సుందరంబెంచి నీ దాస దాసుండనై రామ భక్తుండనై నిన్ను నే కొల్చితే నీకటాక్షంబునన్ జూచితే వేడుకల్జేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్మయాదేవి నిన్నెంచ నేనెంత వాడన్ దయాశాలివై జూచితే దాతవై బ్రోచితే దగ్గరన్నిల్చితే తొల్లి సుగ్రీవుకున్మన్త్రివై స్వామి కార్యార్థమందుండి శ్రీ రామ సౌమిత్రులంజూచి వారిన్విచారించి సర్వేషు పూజించి యద్భానుజుంబంటు గావించి యవ్వాలినింజంపి కాకుత్స్థ తిలకున్ దయాదృష్టి వీక్షించి కిష్కింధకేతెంచి శ్రీ రామ కార్యార్థమై లంక కేతెంచియుం లంకినిన్ జంపియుం లంకయుం గాల్చియున్ భూమిజం జూచి ఆనందముప్పొంగ నాయుంగారంబిచ్చి యారత్నమున్ దెచ్చి శ్రీ రాముకున్నిచ్చి సంతోషునింజేసి సుగ్రీవుడా యంగదా జాంబవంతాది వీరాదులంగూడి యాసేతువున్ దాటి వానరామూక పెన్మూకలై దైత్యులంద్రుంచగా రావణుండంత కాలాగ్ని రూపోగ్రుడై కోరి బ్రహ్మాండమైనట్టి యా శక్తియున్ వేసి యా లక్ష్మణున్ మూర్ఛనొందించగా నప్పుడే పోయి సంజీవియుం దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షించగా కుంభకర్ణాదులన్వీరులన్ బోరి శ్రీ రాము బాణాగ్ని వారందరిం రావణుం జంపగా నంత లోకంబులానందమైయుండి నవ్వేళలందవ్విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీ రాముతో జేర్చి నయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమై యున్న నీకన్న నాకెవ్వరుంగూర్మి లేరంచు మన్నించినన్ శ్రీరామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామసంకీర్తనల్జేసితే పాపముల్బాయవే భయములున్దీరవే భాగ్యముల్గల్గవే సకల సామ్రాజ్యముల్సకల సంపత్కరంముల్దగంగల్గావే వానరాకార యోభక్తమందార యోపుణ్యసంచార యోధీర యోవీర నీవే సమస్తంబు నీవే మహాఫలముగా వెలసి యా తారక బ్రహ్మమంత్రంబు సంధానమున్ జేయుచున్ స్థిరముగా వజ్రదేహంబునుం దాల్చి శ్రీరాము శ్రీరాము యంచుంమనః పూతమై ఎప్పుడున్ తప్పకం దలతు నా జిహ్వాయందుండియుం దీర్ఘ దేహంబు త్రైలోక్య సంచారివై రామనామాంకితధ్యానివై బ్రహ్మవై బ్రహ్మ తేజంబునం రౌద్ర నిజ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార ఓంకార శబ్దంబులన్ క్రూర సర్వ గ్రహ భూత ప్రేత పిశాచ శాకినీ ఢాకినీ మోహినీ గాలిదయ్యంబులన్నీదువాలంబునంజుట్టి నేలంబడంగొట్టి నీ ముష్టి ఘాతంబులం బాహుదండంబులం రోమఖండంబులం ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మప్రభాభాసితంబయిన నీదివ్య తేజంబునుం జూపి రారా నా ముద్దు కుమారా యంచు దయాదృష్టి వీక్షించి నన్నేలు నాస్వామి నమస్తే నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే వ్రతపూర్ణహరీ నమస్తే వాయుపుత్ర నమస్తే నమోనమః

1 comment:

Unknown said...

hanuman chalisa, dandakam pettinanduku chala santhosham